అఫిషియ‌ల్‌: నాగ‌శౌర్య‌-రీతు వ‌ర్మ జంట‌గా ‘వరుడు కావలెను’

, అఫిషియ‌ల్‌: నాగ‌శౌర్య‌-రీతు వ‌ర్మ జంట‌గా ‘వరుడు కావలెను’,
Share This :

అఫిషియ‌ల్‌: నాగ‌శౌర్య‌-రీతు వ‌ర్మ జంట‌గా ‘వరుడు కావలెను’

2020-11-13 22:35:03

, అఫిషియ‌ల్‌: నాగ‌శౌర్య‌-రీతు వ‌ర్మ జంట‌గా ‘వరుడు కావలెను’,

 

‘పెళ్లిచూపులు’ చిత్రంలో హీరోయిన్‌గా ప్ర‌ద‌ర్శించిన‌ అభిన‌యంతో విమ‌ర్శ‌కుల‌, ప్రేక్ష‌కుల‌ హృద‌యాల‌ను ఆక‌ట్టుకున్న రీతూ వ‌ర్మ కెరీర్ ప్ర‌స్తుతం జెట్ స్పీడ్‌ను అందుకుంది. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా ఇంట‌రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌కు సంత‌కం చేస్తూ వ‌స్తున్న ఆమె, ఇటీవ‌లే నాగ‌శౌర్య జోడీగా ఓ సినిమాని అంగీక‌రించిన విష‌యం విదిత‌మే.

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ల‌క్ష్మీ సౌజ‌న్య ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ చిత్రానికి శుక్ర‌వారం అఫిషియ‌ల్‌గా వ‌రుడు కావ‌లెను అనే టైటిల్ ఖ‌రారు చేశారు. దీనికి సంబంధించి ఓ అంద‌మైన వీడియోను విడుద‌ల చేశారు. ఈ వీడియోలో నాగ‌శౌర్య‌, రీతూవ‌ర్మ ఎంతో అందంగా క‌నిపిస్తున్నారు. ఈ గ్లింప్స్‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ విశాల్ చంద్ర‌శేఖ‌ర్ అందించిన నేప‌థ్య సంగీతం మ‌రింత వ‌న్నె తెచ్చింది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. నదియా, మురళీశర్మ, వెన్నెల కిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు. గ‌ణేష్‌కుమార్ రావూరి సంభాష‌ణ‌లు రాస్తున్న ఈ చిత్రానికి వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

, అఫిషియ‌ల్‌: నాగ‌శౌర్య‌-రీతు వ‌ర్మ జంట‌గా ‘వరుడు కావలెను’,

Share This :

Leave a Reply